ఊర్వశి ఇచ్చిన శాపాన్ని అర్జునుడు వరంగా ఏ విధంగా మార్చుకున్నాడు?
జీవితంలో చాలా సందర్భాలు ఉంటాయి. అందులో బాధ పెట్టేవి, సంతోష పెట్టేవి రెండూ ఉంటాయి. సంతోష పెట్టే సందర్భాలను కావాలని మళ్ళీ మళ్ళి గుర్తు చేస్కుని నవ్వుకుంటాం. కానీ బాధ కరమైన విషయాలు అలా కాదు గుర్తు చేసుకోక పోయినా గుర్తుకువస్తూనే ఉంటాయి.
అలాగని దిగులు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు మళ్ళీ ఇంకోసారి చేయకుండా జాగ్రత్త పడొచ్చు.గతంలో మీరు చేసిన పనిలో ఏయే లోపాలో ఉన్నాయో తెలుసుకొని మరొకసారి మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. అప్పుడే మనం చేసిన mistakes నుండి ప్రయోజనాలు పొందుతాం.
నిజానికి చాలా మంది success అవ్వడానికి కూడా కారణం అదే. Failure రాగానే క్రుంగి పోకుండా అంతకు మించిన రెట్టింపు ఉత్సహం తో వారి పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి మనమంటే గిట్టని వాళ్ళు కూడా మన ఓటమి కి కారణం కావచ్చు.
తానొకటి తలిస్తే దేవమొకటి తలచినట్లు శత్రవులు మనకు కీడు చేయాలని చేసే పనుల్లో కూడా ,తెలివిగా ఆలోచిస్తే అందులో మన విజయానికి దారితీసే రహస్యం ఉండవచ్చు!! మహాభారతంలో జరిగిన ఒక సంఘటనే అందుకు ఉదాహరణ.
చిత్రసేనుడికి దుర్యోధనుడికి జరిగిన యుద్ధంలో దుర్యోదనుడు ఓటమి పాలవుతాడు. ధర్మరాజు ఆజ్ఞ మేరకు అర్జునుడు, భీముడు వెళ్లి చిత్రసేనుడి నుండి దుర్యోదనుడిని అతని సేనను విడిపిస్తారు. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడు పెట్టిన ప్రాణ భిక్ష తో సిగ్గుపడి అవమానంతో నేను చచ్చిపోతాను అని ఏడుస్తుంటే,ఏడుస్తున్న దుర్యోధనుడ్ని చూసి కర్ణుడు అతనికి మాట ఇస్తాడు, అజ్ఞాతవాసం పూర్తి అయ్యేలోపు నేను అర్జునుడుని ఖచ్చితంగా చంపుతాను అని.
ఆ తరవాత ఒకరోజు ఆకాశం నుండి వెయ్యి తలలు గల గుర్రాల రధం అర్జునుడు దగ్గరికి వస్తుంది. ఇది మీ తండ్రి ఇంద్రుడు మిమ్మల్ని తీసుకు రమ్మని పంపించాడు అని రధసారధి చెప్తాడు. అందుకు అర్జునుడు అంగీకరించి స్వర్గ లోకానికి వెళ్తాడు. కొంత కాలం అక్కడే ఉండి అస్త్రఆయుదాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాడు. ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధాన్ని కూడా ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాడు.
అలా విద్యలన్ని నేర్చుకున్నాక ఒక రోజు ఇంద్రుడి సభలో ఊర్వశి నాట్యం చేస్తుంది, ఆ నాట్యo వేస్తూ అర్జునుడి ని చూస్తూ ఉంటుంది. నాట్యం అయిపోగానే అర్జునుడు ఆమెకి వందనం చేస్తూ అమ్మా అని సంభోది స్తాడు దాంతో ఆమెకి పట్టలేని కోపం వస్తుంది. ముల్లోకాల్లోనే అందగత్తె అయిన నన్ను అమ్మ అని పిలుస్తావా అని అర్జునుడికి నపుoసకుడిగా ఉండమని శాపం ఇస్తుంది.
అర్జునుడు బాధతో తన తండ్రి దగ్గరికి వెళ్లి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఊర్వశి దగ్గరికి వెళ్లి శాపం వెనక్కి తీస్కోమని అందుకు ఆమె ఒప్పుకోకుండా అందులో మార్పు చేసి నువు అజ్ఞాతావాసంలో ఉన్నప్పుడు ఏదో ఒక సంవత్సరం లో నువ్వు నపుOసకుడిగా మారతావు అంటుంది.
అప్పుడు ఇంద్రుడు అర్జునుడు ని ఓదార్చి ఇది నీకు శాపం కాదు వరం లా ఉపయోగ పడుతుంది వెంటనే వెళ్లి చిత్ర సే నుడి దగ్గర నాట్యం సంగీతం నేర్చుకో మంటాడు. అలా అర్జునుడు చిత్ర సేనుడి దగ్గర నాట్యం నేర్చుకున్న తరవాత తన అన్నల దగ్గరకు వెళ్తాడు.
ఈ లోపు కౌరవులు పాండవులు విరాట ఉన్నారని తెలుసుకుని, ఒక ప్లాన్ వేస్తారు. విరాట రాజ్యం పక్కన ఉన్న త్రికర్త రాజు దగ్గరకు వెళ్లి మాకు మీ సహాయం కావాలి, విరాట రాజ్యం ఉన్న ఆవులను మీ సైనికుల ని పంపించి మీ రాజ్యం తోలికుని వెళ్ళాలి, అందుకు మీకు విరాట రాజ్యాన్ని బహుమతి గా ఇస్తాం అంటాడు. దానికి ఆ రాజు అంగీకరిస్తాడు. మరుసటి రోజు విరాట రాజు విషయం తెలుసుకుని ఆవుల కోసం తన సైన్యం తో త్రికర్త వైపు వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న కౌరవులు వెంటనే విరాట రాజ్యం లోని కోట వైపు గా వెళ్తుంటారు.
కోటలోని మహారాణి సమయానికి ఎవరు లేరే అని కంగారు పడుతుంటుంది. ఇంతలో తన కొడుకు ఉత్తర కుమారుడు నేను యుద్ధం చేస్తానంటూ రొమ్ము విరుచుకుని బయల్దేరతాడు. అప్పుడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు రథ సారధిగా వెళ్తాడు. వెళ్లేసరికి అక్కడ హస్తినాపురం సేనతో కలిసి వచ్చిన దుర్యో ధనుడు, కర్ణుడు, బీష్ముడు, కృపాచార్యుడు కనిపిస్తారు. వాళ్ళందరిని చూడగానే ఉత్తర కుమారుడు వణికిపోయాడు.
కౌరవులు వస్తారని అర్జునుడుకి కూడా తెలియదు. ఉత్తర కుమారుడు భయపడి రధం వెనక్కి తిప్పి వెళ్లిపోదాం అంటాడు దాంతో బృహన్నల వెనక్కి తిప్పుతుంది. బృహన్నల రూపం లో ఉన్న అర్జునుడు ని కౌరవులు గుర్తుపట్టలేదు. వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి పిరికి పందెలు అని కౌరవులు నవ్వుతారు. బృహన్నెల రథాన్ని కోట బైట చెట్ల మధ్యలో ఆపి అక్కడే ఉన్న చెట్టు పైకి ఎక్కి ఒక మూట కిందకి పడేస్తాడు.
ఏం జరుగుతుందో అర్ధం కాక ఉత్తర కుమారుడు ఏం చేస్తున్నావ్ అని బ్రహున్నల ని అడగగా, అప్పుడు అర్జునుడు నేను బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడిని అని చెప్పి భయపడుతున్న ఉత్తర కుమారుణ్ణి సారథిగా చేస్కుని తిరిగి కౌరవుల వైపు వెళ్తాడు. విల్లు ఎక్కుపెట్టి నపుంసకుడి రూపంలో ఉన్న అర్జునుడుని చూసి కౌరవ సేన వణికి పోతుoది.
అప్పుడు దుర్యోధనుడు అర్జునుడిని వదించండి అని తన సైన్యాన్ని ఆజ్ఞా పిస్తాడు.
Comments
Post a Comment